రెండోరోజు ‘ఉప్పెన’కు భారీ కలెక్షన్లు.. బాక్సాఫీస్ దుమ్మురేపిన మెగా మేనల్లుడు

0
21ఉప్పెన చిత్రానికి కలెక్షన్లు కూడా ఉప్పెనలాగే వస్తున్నాయి. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలిరోజు రూ.10. 42 కోట్ల షేర్ రాబట్టి.. డెబ్యూ చిత్రంతో అత్యధిక వసూల్లు రాబట్టిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్ తేజ్. ఇక రెండో రోజు ఈ ఉప్పెన కలెక్షన్ల ఉధృతి రెట్టింపు అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు ఉప్పెన చిత్రం 17. 77 కోట్లు షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్‌కి దగ్గరైంది. ఇందులో నైజాం+ ఏపీ రూ.16. 7.3 కోట్లు రావడం విశేషం. ఇక ఏ ఏరియా నుంచి ఎంత వసూలైదంటే..
✦ నైజాం.. తొలిరోజు రూ.3. 08 కోట్లు, రెండో రోజు 5. 76 కోట్లు
✦ వైజాగ్ తొలిరోజు రూ. 1. 43 కోట్లు, రెండో రోజు 2. 67 కోట్లు
✦ ఈస్ట్ తొలిరోజు.. రూ. 0.98 కోట్లు, రెండో రోజు 1. 63 కోట్లు
✦ వెస్ట్ తొలిరోజు రూ. 0.81 కోట్లు.. రెండో రోజు 1. 13 కోట్లు
✦ క్రిష్ణా తొలిరోజు రూ. 0.62 కోట్లు.. రెండో రోజు 1.10 కోట్లు
✦ గుంటూరు తొలిరోజు రూ. 0.65 కోట్లు, రెండో రోజు 1. 42 కోట్లు
✦ నెల్లూరు తొలిరోజు రూ. 0.35 కోట్లు, రెండో రోజు 0.58
✦ నైజాం+ ఏపీ తొలిరోజు రూ. 9.3 కోట్లు, రెండో రోజు 16. 73 కోట్లు

కాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ 22 కోట్ల షేర్ కాగా.. మూడు రోజుల్లోనే ఆ మొత్తాన్ని బ్రేక్ చేయబోతుంది ఉప్పెన. ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.50 కోట్లకు విక్రయించగా.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లు కాగా.. మొత్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఒక డెబ్యూ హీరోకి రూ.22 కోట్ల షేర్ రాబట్టాలంటే చిన్న విషయం కాదు. అయితే ఉప్పెన చిత్రంతో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ని బ్రేక్ చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here