యజమాని కుమార్తెపై అఘాయిత్యం చేసి చంపేసిన గుమస్తా

0
26కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు యజమాని కుమార్తెపై అఘాయిత్యం చేసి చంపేశాడు. అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, గొంతునులిమి హత్య చేశాడు. తెలంగాణ సరిహద్దులోని () జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా డివిశికి చెందిన బాబు (35) అనే వ్యక్తి గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఆ రైతు కుటుంబీకులు పొలంలో పనినిమిత్తం చేనుకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో గుమాస్తా బాబు ఆ పాపతో ఆడుతూ కనిపించాడు.

సాయంత్రం చీకటి పడుతున్నా పాప ఇంటికి రాకపోవడంతో యజమాని కుటుంబంలో ఆందోళన మొదలైంది. గ్రామస్థుల సాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. అక్కడికి సమీపంలోని చెరువు ఒడ్డున నిందితుడు తచ్చాడుతూ కనిపించాడు. అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆ చిన్నారి గడ్డి పొదల్లో దుస్తులు లేకుండా విగతజీవిగా పడి ఉంది. నిందితుడు బాబు అప్పటికే అక్కడ నుంచి పరారయ్యాడు.

బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికపై అఘాయిత్యం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. నిందితున్ని వెంటనే ఉరి తీయాలంటూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కుమార్తెను ఇంటికి తీసుకొస్తాడని నమ్మి వదిలేయడమే ఆ తల్లిదండ్రుల పాలిట శాపమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here