మెగా హీరోను కలిసేందుకు సాహసం.. ఏకంగా 200 కి.మీ. నడిచిన వీరాభిమాని

0
18సినిమా హీరోలపై వారి అభిమానులు చూపించే అభిమానం మామూలుగా ఉండదు. తాము ఎంతగానో ఇష్టపడే హీరోని చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. వారితో ఫోటో దిగాలని తాపత్రయపడుతుంటారు. ఇక సినిమాల విడుదలకు భారీ కటౌట్లు, వాటికి పూలదండలు, పాలాభిషేకాలు ఎప్పుడూ ఉండేవే. కానీ, ఇప్పుడు ఓ మెగా హీరోని కలిసేందుకు ఈ వీరాభిమాని ఏకంగా 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. వివరాలివీ..

తెలంగాణలోని జిల్లా భిక్కనూరుకు చెందిన బాలు అనే వ్యక్తికి మెగా కుటుంబానికి వీరాభిమాని. అందులోనూ ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ అంటే బాగా పిచ్చి. ఆ అమితమైన అభిమానంతోనే అతను వరుణ్‌ తేజ్‌ను కలవాలని గత మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా భిక్కనూరు నుంచి హైదరాబాద్‌ వరకూ 200 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. తనని చూసేందుకు కోసం అంత దూరం నడిచి వచ్చిన ఈ సూపర్‌ అభిమానిని వరుణ్‌ తేజ్‌ ఆదరించారు. ఆ అభిమానిని తన ఆఫీసులో కలిశారు.

తన అభిమాని ఇలా తన కోసం నడిచి వస్తున్న విషయం తెలుసుకున్న వరుణ్‌ తేజ్‌ నేరుగా తన కార్యాలయానికే పిలిపించారు. అతనితో కొద్ది సేపు మాట్లాడారు. తనపై చూపుతున్న అభిమానానికి వరుణ్‌ తేజ్ ఎంతో సంతోషించారు. ఆ అభిమానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అభిమానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా తన అభిమానిని కలిసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here