ముంబై రెడ్‌లైట్ ఏరియాకు టాలీవుడ్ హీరోయిన్.. అందుకే వెళ్లా! శ్వేతా బసు ప్రసాద్ ఎమోషనల్

0
23ముంబై రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిందట యంగ్ హీరోయిన్ . ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలుపుతూ అందుకు కారణాలేంటి అనే విషయాలపై ఓపెన్ అయింది. దీంతో ఓ హీరోయిన్ ఇలా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. మరి ఇంతకీ శ్వేతా అక్కడికి ఎందుకు వెళ్లిందో చూద్దామా..

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాక చిక్కులో పడింది యంగ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని వార్త‌ల్లో నిలవడంతో దేశవ్యాప్తంగా అమ్మడి పేరు మారుమోగింది. అయితే ఈ ఇష్యూలో నిర్దోషిగా బ‌య‌ట‌కు వచ్చిన ఆమె.. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్ట‌ల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ వెంటనే భర్తతో విడాకులు తీసుకోవడం లాంటి పరిణామాలతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఇక ఇటీవలే తిరిగి సినిమా వేట ప్రారంభించిన ఆమె, కెరీర్‌ని ఎలాగైనా మలుపు తిప్పుకోవాలనే పట్టుదలతో ఓ సినిమా చేస్తోంది.

ప్రస్తుతం ఆమె చేస్తున్న మూవీ `ఇండియా లాక్‌డౌన్‌`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ బండార్క‌ర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సెక్స్ వ‌ర్క‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది శ్వేతా బసు ప్రసాద్. ఈ పాత్రలో రియాలిటీ ఉట్టిపడేలా నటించేందుకు గాను ముంబై రెడ్‌లైట్ ఏరియాను సందర్శించిందట ఈ హీరోయిన్. అక్కడికెళ్లి కోవిడ్, లాక్‌డౌన్ స‌మ‌యంలో సెక్స్ వ‌ర్క‌ర్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, వారి రోజువారీ జీవితాల గురించి తెలుసుకున్నాక చాలా బాధ పడ్డానని చెబుతూ ఎమోషనల్ అయింది శ్వేతా బసు.

చిత్ర దర్శకుడితో పాటు కామటిపురానికి వెళ్లి అక్క‌డి వారి యాస‌ను బ‌ట్టి తన సినిమాలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని, అక్క‌డికి వెళ్ల‌డం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అని శ్వేతా బసు చెప్పడం విశేషం. సెక్స్ వర్కర్ల కష్టాలను రియాలిటీగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే వారిని కలిశామని ఆమె తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here