మాల్దీవుల్లో RRR బ్యూటి.. బికినీ అందాల్లో పిచ్చెక్కిస్తోన్న స్టార్ హీరోయిన్

0
22ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో సీత పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటి ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. తన సోదరి షహీన్ భట్, స్నేహితురాళ్లు ఆకాంక్ష రంజన్ కపూర్, అనుష్క రంజన్ కపూర్‌లతో కలిసి మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. స్నేహితురాలు ఆకాంక్ష రంజన్ కపూర్‌తో తీసుకున్న సెల్ఫీని.. అలాగే తాను బికినీలో ఉన్న రెండు ఫొటోలను తాజాగా ఆలియా షేర్ చేశారు.

బీచ్ వద్ద ఇసుకలో కూర్చొని ఫొటోలకు పోజులిచ్చిన ఆలియా ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ మల్టీకలర్ స్విమ్ సూట్‌లో ఆలియా మెరిసిపోతున్నారు. అలాగే, సముద్ర తీరాన అందాలను ఆరబోస్తున్నారు. ఆలియాతో పాటు రంజన్ కపూర్ సిస్టర్స్ ఆకాంక్ష, అనుష్క కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ బికినీ ఫొటోలను షేర్ చేశారు. మాల్దీవులు అందాలను ఆస్వాదిస్తున్నట్టు వారు తమ పోస్టుల్లో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో అయితే వీడియోలు కూడా షేర్ చేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆలియా భట్ మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి RRR కాగా.. ‘గంగుబాయి కఠియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ మరో రెండు సినిమాలు. RRRలో రామ్ చరణ్‌కు జంటగా సీత పాత్రలో నటిస్తున్నారు ఆలియా. ఇక ‘బ్రహ్మాస్త్ర’లో ప్రియుడు రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ తారాగణంతో రూపొందుతోంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని లాంటి స్టార్లు నటిస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, RRR సినిమా తరవాతే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. RRR దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here