భారత్ ఔదార్యానికి ముగ్ధుడైన పీటర్సన్.. ప్రధాని మోదీ హార్ట్ టచింగ్ రిప్లయ్!

0
24కరోనా మహమ్మారిపై పోరులో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పొరుగు దేశాలతోపాటు మిత్రదేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తూ.. మానవత్వం చాటుకుంటోంది. ఇప్పటికే పాకిస్థాన్ మినహా సార్క్ దేశాలన్నింటికీ కోవిడ్ టీకాలను పంపిన భారత్.. మంగళవారం దక్షిణాఫ్రికాకు సైతం వ్యాక్సిన్‌ను చేరవేసింది. కరోనా టీకాలతో దక్షిణాఫ్రికాలో దిగిన విమానం ఫొటోను విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ ఫిదా అయిపోయారు. రోజు రోజుకూ భారత్ ఉదారత, దయా గుణం పెరిగిపోతోందని.. తనకెంతో ఇష్టమైన దేశమని పీటర్సన్ ట్వీట్ చేశారు. ఈ మాజీ క్రికెటర్ ట్వీట్‌కు బదులిచ్చారు. భారత్ పట్ల మీరు చూపిన ఆప్యాయత ఎంతో ఆనందం కలిగించిందన్న మోదీ.. వసుధైక కుటుంబం అనే భావనను భారతావని విశ్వసిస్తుందని తెలిపారు.

కేవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తర్వాత ఆయన కెరీర్ కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కెవిన్.. 104 టెస్టుల్లో 8181 రన్స్ చేశాడు. 134 వన్డేలు ఆడి 4440 పరుగులు చేయడంతోపాటు.. 37 టీ20ల్లో 1176 పరుగులు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here