బోయపాటికి షాకిచ్చిన యంగ్ హీరో.. రోల్ గురించి చెప్పగానే బెంబేలెత్తిపోయాడట

0
23మాస్ డైరెక్టర్ , నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్‌ వంటి సూపర్‌హిట్ల తర్వాత వీరి కాంబో రిపీట్ కావడమే దీనికి కారణం. ఈ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి గానీ.. నిర్మాతలు మాత్రం బడ్జెట్‌ విషయంలో పెద్దగా డేర్ చేయలేకపోతున్నారని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది.

Also Read:

ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ గాసిప్ ఒకటి అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ సినిమాలో ఓ నెగిటివ్ రోల్ కోసం బోయపాటి శ్రీను ఓ యంగ్ హీరోను సంప్రదించారట. అయితే బోయపాటి సినిమాలో మితిమీరిన హింస ఉంటుందని, పైగా నెగిటివ్ రోల్ అంటే అది మరింత శ్రుతిమించుతుందన్న ఆందోళనతో రిస్క్ చేయలేక ఆ హీరో నో చెప్పేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. నిఖిల్. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం ‘కార్తికేయ-2’ సినిమా కోసం సిద్ధపడుతున్నాడు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here