బెల్లంకొండకు నో చెప్పిన బి-టౌన్ బ్యూటీలు.. ‘ఛత్రపతి’కి తప్పని తిప్పలు!!

0
22టాలీవుడ్ యంగ్ హీరో బాలీవుడ్ ఎంట్రీకి రంగ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ రీమేక్ ద్వారా సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తెలుగులో ప్రభాస్ పోషించిన పాత్రలో శ్రీనివాస్ పరకాయ ప్రవేశం చేయబోతున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మించనున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా వినాయకే. శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శీను’కు వినాయక్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు బాలీవుడ్‌కు కూడా శ్రీనివాస్‌ను వినాయక్ పరిచయం చేస్తుండటం విశేషం. ‘ఖైదీ నెంబర్ 150’తో విజయం అందుకున్న వినాయక్ ఆ తరవాత మరో సినిమా చేయలేదు. మరోవైపు, బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఏడాది ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్తున్నారు.

‘ఛత్రపతి’ లాంటి బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్‌తో శ్రీనివాస్ బాలీవుడ్‌కు వెళ్తుండటంతో ఈ సినిమా జనాల్లో ఆసక్తి పెరిగింది. దీనికి తోడు ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన ప్రముఖ బాలీవుడ్ నటి నటించబోతోందని ప్రచారం జరగడంతో ఆసక్తి రెట్టింపు అయ్యింది. కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆసక్తి చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎవరో ఒక స్టార్ హీరోయిన్‌ను నటింపజేయడానికి దర్శక నిర్మాతలు గట్టిగానే ప్రయత్నించారట. కానీ, వర్కౌట్ అవ్వలేదంటున్నారు.

ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్లు కైరా అద్వానీ, అనన్య పాండే, దిశా పటాని, శ్రద్ధా కపూర్ మేనేజర్లను శ్రీనివాస్ సినిమా మేకర్స్ సంప్రదించారట. కానీ, వీళ్లంతా బెల్లంకొండ వారి ఆఫర్‌ను తిరస్కరించారని టాక్. దీంతో ప్రస్తుతం మరో హీరోయిన్‌ను వెతికే వేటలో ఉన్నారట మేకర్స్. మరి ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ ప్రచారం అయితే జరుగుతోంది. ఇంతకీ బెల్లంకొండ సరసన నటించబోయే బాలీవుడ్ బ్యూటీ ఎవరో త్వరలోనే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here