బాలీవుడ్‌లో విషాదం.. రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్ కన్నుమూత

0
23బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. రిషి కపూర్, రణధీర్ కపూర్ సోదరుడు ఫిబ్రవరి 9వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 58 సంవత్సరాలు. గతేడాది రిషి కపూర్ కన్నుమూయగా ఏడాది తిరగకముందే కపూర్ ఫ్యామిలీలో మరో విషాదం చోటుచేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది.

కొద్దిసేపటి క్రితం రాజీవ్ కపూర్‌కి గుండెపోటు రావడంతో చెంబూర్ లోని వారి నివాసానికి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేస్తుండగానే హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్‌ను అంతా ముద్దుగా చింపు అనే పేరుతో పిలుచుకునేవారు.

1991లో సూపర్ హిట్ సినిమా హెన్నాతో నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాజీవ్ కపూర్. ప్రేమ్ గ్రంథ్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నారు. రామ్ తేరి గంగా మెయిలీ, మేరా సాతి, హమ్ టు చాలే పార్డెస్ వంటి సినిమాల్లో నటించి నటుడిగా కూడా సత్తా చాటారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాజీవ్‌ మృతిపట్ల స్పందించిన ఆయన సోదరుడు రణధీర్‌ కపూర్.. నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయాం అని తెలిపారు. రాజీవ్ కపూర్ మరణవార్త తెలిసి కరీనా కపూర్, కరిష్మా కపూర్ సహా కపూర్ ఫ్యామిలీ మొత్తం ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here