బాలికను ఎత్తుకెళ్లిన పక్కింటి వ్యక్తి.. కారణం తెలిసి షాకైన పోలీసులు, చివరికి

0
24బాలిక కిడ్నాప్ కేసును కేవలం మూడు గంటల్లోనే చేధించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న జిల్లా టూటౌన్ పోలీసులు. నగరంలోని ఇన్నీసుపేట దుర్గాలమ్మ గుడి వీధికి చెందిన బి.రాము రెండో కూతురు రోహిణి శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన అనసూరి సత్యనారాయణ ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సత్యనారాయణ దేవరపల్లి మండలం తిరుగుడుమెట్ట వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని బాలికను అతడి బారి నుంచి రక్షించారు. ఏలూరుకు చెందిన సీతారత్నం, జ్యోతి అనే మహిళలు చిన్నారిని పెంచుకుంటామని అడగడంతో సత్యనారాయణ బాలికను అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం మూడు గంటల్లో కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఇటీవల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తామని, ఆన్‌లైన్లో రుణాలు ఇప్పిస్తామని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లకు వస్తున్నారని, అలాంటి వారితో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here