బారికేడ్లను దాటుకుని వచ్చి సీఎం సభా ప్రాంగణం, హెలీప్యాడ్‌ను ధ్వంసం చేసిన రైతులు

0
21కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాల సెగ హరియాణా ముఖ్యమంత్రికి తగిలింది. రైతుల ఆందోళనతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సభను రద్దుచేసుకున్నారు. కర్నాల్ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం బహిరంగ సభను ఏర్పాటుచేశారు. అయితే, రైతులు నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు నిరసనలు తెలియజేయడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. అయినా, రైతులు వెనక్కు తగ్గలేదు. పోలీసుల కళ్లుగప్పి క్లైమా గ్రామంలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

సభా ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లి వేదికపైకి ఎక్కిన రైతులు.. కుర్చీలు కింద పడేసి, అక్కడ పోస్టర్లను చించేశారు. హెలిప్యాడ్‌ను ధ్వంసం చేశారు. భద్రతా కారణాలతో ముఖ్యమంత్రి సభను రద్దుచేసుకున్నారు. కైమ్లా గ్రామంలో ‘’ సభను నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు.

సీఎం సభను అడ్డుకుంటామని రైతు సంఘాలు ప్రకటించడంతో కైమ్లా గ్రామంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు, మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు, పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఎనిమిదిసార్లు చర్చలు జరిగాయి. తదుపరి చర్చలు జనవరి 15న జరగనున్నాయి.

ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి వెళ్తున్న పంజాబ్ రైతులను హరియాణా సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బారికేడ్లు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల సాయంతో రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కిసాన్ మహాపంచాయత్‌ను ఏర్పాటుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here