బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..

0
26ఐదో సెషన్ పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి లోక్‌సభ సచివాలయం గురువారం ఈ ప్రకటన జారీ చేసింది. ఈ సమావేశాల్లోనే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2021-22ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకు 20 రోజుల విరామం తర్వాత మళ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజున ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను విడుదల చేయనున్నారు.

ఈ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 8తో ముగిసే అవకాశం ఉన్నట్టు లోక్ సభ సచివాలయం పేర్కొంది. సెప్టెంబర్‌లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత మళ్లీ లోక్‌సభ, రాజ్యసభలు భేటీ కావడం ఇదే తొలిసారి. అప్పుడు ఏడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరిగాయి. పలువురు ఎంపీలకు కరోనా వైరస్‌ సోకడంతో పార్లమెంటు సభలను నిరవధికంగా వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో నవంబర్‌ – డిసెంబర్‌లో జరగాల్సిన శీతకాల సమావేశాలు కూడా నిర్వహించని సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here