బట్టతలతో కనిపించిన భర్త.. ఐదేళ్లు కాపురం చేశాక అసలు సంగతి తెలిసి మహిళ షాక్

0
22ఒత్తైన జట్టు, అందమైన తలకట్టుతో హీరోలా ఉన్నాడని మురిసిపోయి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లు కాపురం చేసిన తరువాత ఒరిజినల్ జట్టు కాదని, విగ్గు అని తెలిసి షాకైంది. దీంతో భర్త తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. ఆలపాక్కంకు చెందిన రాజశేఖర్‌కు బట్టతల ఉండటంతో నిత్యం విగ్ ధరించే ఉండేవాడు. ఈ క్రమంలోనే 2015లో విగ్‌తోనే పెళ్లి చూపులకు వెళ్లగా పెళ్లకూతురికి తెగ నచ్చేసి పెళ్లి చేసుకుంది. విగ్ సహజమైన వెంట్రుకలతో తయారుచేసింది కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు.

Also Read:

ఇటీవల రాజశేఖర్‌ తలపై విగ్‌ లేని సమయంలో చూసి భార్య షాకైంది. దీంతో ఆమె గట్టిగా నిలదీయడంతో తనకు బట్టతల ఉండటంతో విగ్ ధరిస్తున్నాని చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది. దీంతో పంచాయతీ పెట్టగా అతడితో కాపురం చేయలేనని ఆమె తెగేసి చెప్పింది. దీనికి తోడు కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలు వాపసు చేయాలని డిమాండ్‌ చేసింది. దీంతో భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమెపై దాడికి పాల్పడ్డారు

Also Read:

దీంతో బాధితురాలు భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యాట్రమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన రాజశేఖర్ విగ్గు పెట్టుకుని మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని, అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here