ఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం.. హైదరాబాద్‌లో మరో దారుణం

0
17శివార్లలోని మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఫార్మసీ విద్యార్థినిపై ఓ ఆటోడ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద బుధవారం (ఫిబ్రవరి 9) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లిన యువతి ఇంటికి తిరిగి వస్తుండగా ఆటోడ్రైవర్ అపహరించినట్లు బాధితురాలు చెబుతోంది. అనంతరం జోడిమెట్ల వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఆ తర్వాత యువతిని దుస్తులు లేకుండా అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆటోడ్రైవర్‌ను గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here