ప్రియుడితో మాల్దీవుల్లో కియారా అద్వానీ సరదా.. బ్యాక్‌లెస్ పోజుతో మత్తెక్కించిన లస్ట్ భామ

0
37న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సినీ సెలబ్రిటీలు రెడీ అయ్యారు. ఎవరికి వారు తమ తమ ప్లాన్స్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కొన్ని సెలబ్రిటీ ప్రేమ పక్షులు ఈ వేడుకల కోసం మాల్దీవ్స్ లాంటి అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నాయి. ఆ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సిన జోడీ కియారా అద్వానీ- . ఈ ఇద్దరూ కలిసి 2021 న్యూ ఇయర్ సంబరాల కోసం మాల్దీవ్స్ వెళ్లారు. దీంతో గత కొంతకాలంగా ఈ జోడీ డేటింగ్ చేస్తోందంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరింది.

నిన్న (బుధవారం) కియారా, సిద్దార్థ్ మల్హోత్రా ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటికి చిక్కడంతో వీరిద్దరి మాల్దీవ్స్ ట్రిప్ వ్యవహారం బయటపడింది. ఇకపోతే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కియారా పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడితో కలిసి మాల్దీవుల్లో దిగగానే ఎంజాయ్ చేయడం ప్రారంభించింది కియారా. ఈ మేరకు సముద్ర తీరాన బ్యాక్‌లెస్ బికినీతో ఓ ఫొటోకు పోజిచ్చి ఆ పిక్‌ని అభిమానులతో పంచుకుంది. ”2021 కోసం ఎదురు చూస్తున్నా” అంటూ దీనిపై ట్యాగ్ చేసింది. ఇది చూసి మరి సిద్దార్థ్ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

తెలుగులో మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో, రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న .. హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేసింది. అలాగే ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా బోల్డ్ క్యారెక్టర్ చేసి తన డేరింగ్‌నెస్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ”షేర్షా, భూల్ భులయ్యా, జగ్ జగ్ జీయో” చిత్రాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here