ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. – watch: dog with leopard whole night in a toilet in karnataka

0
28


కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్వాయ్‌‌లో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రియాంకతో పాటు మరెవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లక్నో నుంచి రాంపూర్‌ వెళ్తుండగా గురువారం (ఫిబ్రవరి 4) ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

శునకం, చిరుతపులి

రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి.. తదుపరి త5

వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న నవ్‌రీత్ సింగ్.. వాహనం తిరగబడటంతో అక్కడికక్కడే మరణించాడు. రాంపూర్ పరిధిలోని అతడి స్వస్థలంలో ఆ రైతు అంత్యక్రియలు జరిగాయి. గురువారం ఉదయం ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రియాంక గాంధీకి ఈ చేదు అనువం ఎదురైంది.

అనంతరం ప్రియాంక తన కారును అక్కడే వదిలేసి వెళ్లారు. యథావిధిగా ఆ కార్యక్రమానికి వెళ్లారు. అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రియాంక గాంధీ ప్రయాణిస్తున్న కారు వైపర్లు పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు అద్దంపై పేరుకున్న దుమ్ముతో రోడ్డు కనిపించకపోవడంతో.. డ్రైవర్ కారు వేగం తగ్గించాడు. దీంతో వెనుక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది? అనంతరం కారు అద్దాలను ప్రియాంక స్వయంగా శుభ్రం చేసుకుని కొద్దిసేపటి తర్వాత దిబ్దిబా గ్రామానికి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here