పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. క్రిష్‌తో సెట్స్ పైకి పవర్ స్టార్.. మొత్తం ప్లాన్ ఇదే

0
27ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు కెమెరా ముందు చురుకుగా వ్యవహరిస్తున్నారు పవర్ స్టార్ . ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఆయన.. వరుస సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ కావడంతో తర్వాత పవన్ ఏ సినిమా పూర్తి చేస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా క్రిష్‌తో చేయబోతున్న సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టేస్తూ అభిమానులను ఖుషీ చేశారు పవన్.

వకీల్ సాబ్ తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని విన్నాం. ఇటీవలే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. అయితే మెగా అభిమానుల్లో జోష్ నింపేలా పవన్ కళ్యాణ్ ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా క్రిష్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యారట. ఈ మేరకు క్రిష్‌తో అన్ని విషయాలు చర్చించి సెట్స్ పైకి వచ్చేశారు పవన్.

మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ మూవీ సోమవారం సెట్స్‌పైకి వచ్చిందని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌‌గా ట్వీట్ చేసింది. ఈ మేరకు షూటింగ్‌ లొకేషన్‌ ఫొటోలను షేర్ చేసింది. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది మే నెల వరకు షూటింగ్‌ మొత్తం పూర్తి చేసేలా పవన్- క్రిష్ ప్లాన్ చేశారట. ఇకపై ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పాటు క్రిష్ మూవీ రెండింటిలోనూ పవన్ భాగం కానున్నారని టాక్. అందుకు తగ్గట్టుగా డేట్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here