డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా 'తనిఖీ కేంద్రం 1995' మోషన్ పోస్టర్ రిలీజ్

0
31సంక్రాంతికి విడుదలైన విజయ్ ‘మాస్టర్’ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తనిఖీకేంద్రం 1995’. షజ్ఞ శ్రీవేణున్ హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షిత ప్రొడక్షన్స్, ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కిషోర్ చందిన దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సపోర్ట్ లభించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు డైరెక్టర్ మారుతి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”పోస్టర్ చాలా విభిన్నంగా ఉంది. ఇలాంటి సినిమాలు, ఇలాంటి యువ దర్శకులు పరిశ్రమకి చాలా అవసరం. సినిమా సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి” అని అన్నారు.

చిత్ర దర్శకుడు చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. ”1995లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో టీజర్ విడుదల చేసి.. అతిత్వరలో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

హీరో మహేంద్రన్ మాట్లాడుతూ.. ”మాస్టర్ చిత్రంలో విజయ్ సేతుపతి టీనేజ్ రోల్ ఎంత పేరు తెచ్చిందో.. ఈ చిత్రం దానికి పదింతలు గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది. దర్శకుడు రవి కిషోర్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్లీ మళ్లీ రవి కిశోర్ చందినతో పని చేయాలని ఉంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here