డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రభాస్ సాయం.. మరింత క్రేజ్

0
31‘ఆ!’, ‘కల్కి’ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ సినిమా ద్వారా తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టించారు.

ఇప్పటికే ప్రముఖ నటి సమంత విడుదల చేసిన ‘జాంబీ రెడ్డి’ ఫ‌స్ట్ బైట్‌ (టీజర్)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ల‌భించింది. జ‌న‌వ‌రి 2న ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ (ట్రైలర్) విడుద‌ల కానుంది. ఈ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్‌‌గా మారిన రెబ‌ల్ స్టార్ ఆవిష్కరించ‌నున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది.

టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

కాగా, యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. స్క్రిప్ట్ విల్లే స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయిబాబు ఎడిటర్. రచన, దర్శకత్వం ప్రశాంత్ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here