ట్రంప్‌ను తొలగించను.. ట్విస్ట్ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు

0
26మెరికాలో అభిశంసన తీర్మానం దుమారం రేపుతోంది. మైక్‌ పెన్స్‌.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను 25వ సవరణ అధికారం ద్వారా పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకోగా ఆయన ట్విస్ట్ ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించుకోలేనని ప్రకటించారు. అధ్యక్షుడు అసమర్థుడని భావించినప్పుడు మాత్రమే ఆ అధికారాన్ని ఉపయోగించాల్సి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది ఉపయోగిస్తే అమెరికా చరిత్రలో అదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 12) ఆయన ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు.

అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా కేబినెట్‌ ఆమోదంతో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అధికారం ఉపాధ్యక్షుడికి ఉంటుంది. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు ఆ బాధ్యతల్లో కొనసాగవచ్చు. అయితే.. అధ్యక్షుడు అసమర్థుడని భావించినప్పుడు మాత్రమే ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా రాజ్యాంగం చెబుతోంది.

కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి కేవలం కొన్ని రోజుల గడువే ఉందని.. అధికార బదిలీపై దృష్టి సారించాలని పెలోసీకి మైక్ పెన్స్ సూచించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి నుంచి యావత్తు దేశం కోలుకోవడానికి ఇదే సరైన సమయం అన్నారు.

‘ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను తొలగించాలనుకోవడం కేవలం రాజకీయం చేయడమే. అలా చేస్తే ప్రజల్లో మరింత విభజన, అసహనానికి కారణమయ్యే ప్రమాదం ఉంది’ అని మైక్ పెన్స్ అన్నారు. అయితే.. డెమొక్రాట్లు మాత్రం ట్రంప్‌‌పై అభిశంసనకు సిద్ధమయ్యారు. ప్రతినిధుల సభలో ఈ తీర్మానంపై చర్చ జరుగనుంది.

మరోవైపు.. ట్రంప్‌, పెన్స్‌ మధ్య భేదాభిప్రాయాలు తగ్గినట్లు సమాచారం. మంగళవారం వారివురు వైట్ హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో కలుసుకున్నారు. పదవీకాలం పూర్తయ్యే వరకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

కాంగ్రెస్‌లో జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమయంలో మైక్ పెన్స్‌ అధ్యక్షుడి ఆదేశాలను బేఖాతరు చేయడంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెన్స్‌పై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here