తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్‌కి చేరువైందని తెలుస్తోంది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి 1.5 కోట్ల గ్రాస్, 91 లక్షల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు అదే ఫామ్ కొనసాగించింది. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.4.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ విలువ రూ.2 కోట్ల పైనే ఉందని తెలిసింది. ఇక మూడో రోజు వీకెండ్ (ఆదివారం) కావడంతో కలెక్షన్స్‌లో పెద్దగా డ్రాప్ కనిపించలేదు.
ఏరియా వారీగా మూడో రోజు కలెక్టన్ రిపోర్ట్ చూస్తే..
నైజాం- 56 లక్షలు
సీడెడ్- 29 లక్షలు
ఉత్తరాంధ్ర- 17 లక్షలు
తూర్పు గోదావరి- 10 లక్షలు
పశ్చిమ గోదావరి- 9 లక్షలు
గుంటూరు-16 లక్షలు
కృష్ణా- 14.4 లక్షలు
నెల్లూరు- 9 లక్షలు
మొత్తంగా మూడో రోజుకు గాను 1.6 కోట్ల నెట్, 2.85 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తాజాగా వసూళ్లను బట్టి ప్రకారం చూస్తే మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ క్రాస్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. టోటల్‌గా చెప్పాలంటే తొలి వీకెండ్ ముగిసేసరికి మొత్తంగా 4.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.