ఘనంగా రఘుబాబు కూతురు నిశ్చితార్థం.. మోహన్ బాబు, బ్రహ్మానందం ఆత్మీయ ఆలింగనం

0
32గిరిబాబు నట వారసుడిగా, అంతకుమించి విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం . తనదైన నటనతో వెండితెరపై అలరించడమే గాక, ఇండస్ట్రీలోని ప్రతి వ్యక్తితో ఎంతో స్నేహంగా మెదులుతుంటారాయన. దాదాపు టాలీవుడ్ లోని అందరు హీరోలు, దర్శకనిర్మాతలతో కలిసి పని చేసిన ఆయన.. నిన్న (ఫిబ్రవరి 14) ఆదివారం రోజున తన కూతురు నిశ్చితార్ధ వేడుకను ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్ధ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి , బ్రహ్మానందం, సాయి ధరమ్ తేజ్, రవితేజ, రాఘవేంద్ర రావు, మంచు లక్ష్మి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, యాంకర్ అనసూయ తదితరులు హాజరై సందడి చేశారు. లెజెండరీ యాక్టర్స్ మోహన్ బాబు, ఆత్మీయ ఆలింగనం చేసుకుంటుండగా వారిపై కెమెరా క్లిక్స్ పడ్డాయి. సంప్రదాయ దుస్తుల్లో మంచు లక్ష్మి కనిపించగా, బ్లాక్ కుర్తాలో సాయి ధరమ్ తేజ్, స్టైలిష్ డ్రెస్‌లో రవితేజ కనిపించారు. చాలా రోజుల తర్వాత యాక్టర్స్ అంతా ఇలా మీట్ కావడంతో ఈ నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here