గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైన బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్.. మరో నలుగురికి ఛాలెంజ్

0
31పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యాక్రమంలో ఎందరో సినీ నటులు, రాజకీయ ప్రముఖులు భాగం కాగా తాజాగా బిగ్ బాస్ 4 కంటిస్టెంట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని పార్క్‌లో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశారు.

దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్‌లో మొక్కలు నాటిన మోనాల్.. అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్ గారు చేసిన అద్భుతమైన ఉద్యమం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. ఆయన నుంచి ప్రేరణ పొంది సవాలును స్వీకరించి మొక్కలు నాటానని అన్నారు. మరో నలుగురు (మాకప ఆనంద్ , మిత్ర గాద్వి, క్రిష్ణ కుల్ శేకరన్, మల్హాత్ థాకర్)లు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని ఆమె తన ఛాలెంజ్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here