గుడ్ న్యూస్: కరోనా తగ్గుముఖం.. 15 రాష్ట్రాల్లో మరణాలు నిల్

0
25దేశంలో వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారి కరోనా వైరస్‌ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్-19 కారణంగా ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం (ఫిబ్రవరి 9) పేర్కొంది. ఏడాది కాలంగా కరోనా ప్రభావంతో విసిగిపోయిన ప్రజలకు ఇది గొప్ప ఊరట కలిగించే వార్త.

‘గత 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. గత వారం రోజుల నుంచి 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఇది ఉపశమనాన్ని కలిగించే విషయం’ అని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్నారు.

కరోనా మరణాలు నమోదు కాని రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ కూడా ఉండటం విశేషం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1.43 లక్షలు ఉన్నాయి. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు లక్షా యాభై ఐదు వేల మంది మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు 63 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here