గర్వంగా చెప్పుకునే క్షణం వస్తుంది.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అమితాబ్ బచ్చన్‌ రియాక్షన్

0
19గత సంవత్సర కాలంగా ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా కారణంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ఆర్థికంగా పేద ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ అని చెప్పలేం. ఈ ఎఫెక్ట్‌తో చాలా దేశాలు ఆర్థిక నష్టాలతో విలవిలలాడి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రయత్నాలు చేసి కరోనా మహమ్మారిపై పోరాటం ప్రారంభించాయి వైద్య బృందాలు. ఇందులో భాగంగా మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.

తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా దీనిపై బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ ట్విట్టర్ వేదికగా‌ రియాక్ట్ అయ్యారు. “పోలియో రహిత దేశంగా మన భారతదేశం మారినప్పుడు ఎంతో గర్వించాం. అదే తరహాలో కోవిడ్‌- 19 రహిత దేశమని గర్వంగా చెప్పుకునే క్షణం కూడా రాబోతోంది” అని అమితాబ్‌ పేర్కొన్నారు. గతేడాది అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకొని వారంతా కోలుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here