'క‌ప‌ట‌ధారి' థీమ్ ట్రైల‌ర్: సమరమే అంటూ రంగంలోకి సుమంత్

0
29వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించే హీరో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆయన నటించిన కొత్త సినిమా `క‌ప‌ట‌ధారి`. క‌న్న‌డలో సూప‌ర్ హిట్ సాధించిన `కావ‌లుధారి` సినిమాకు ఇది రీమేక్‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించారు.

ఆర్కియాల‌జీలో ఎప్పుడో జ‌రిగిన హ‌త్య‌, హంత‌కుడు ఎవ‌రో తెలియ‌దు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అంతుప‌ట్ట‌ని ఆ హంత‌కుడి ర‌హ‌స్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్ట‌ర్ ఎలా చేధించాడ‌నే అంశంతో రూపొందిన కథే ఈ `క‌ప‌ట‌ధారి`. ఫిబ్ర‌వ‌రి 19న ఈ సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ థీమ్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచేసింది చిత్రయూనిట్.

‘ఓ మ‌నిషి నిజాన్ని బ‌తికించ‌డానికి స‌మరం చేయాలి’ అని చెప్పే మాంటేజ్ సాంగ్ ఈ థీమ్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. అస‌లు హంత‌కుడు ఎవ‌రు? అనే విష‌యాన్ని గోప్యంగా ఉంచుతూ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన `క‌ప‌ట‌ధారి` ప్ర‌మోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. రేపు అనగా (ఫిబ్ర‌వ‌రి 16) మంగ‌ళ‌వారం రోజున `క‌ప‌ట‌ధారి` ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. సైమ‌న్ కె.కింగ్ సంగీతం అందిస్తున్నారు. నాజర్‌, సంపత్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here