క్రాక్ ట్విట్టర్ రివ్యూ: క్లాస్, మాస్ ఆడియన్స్ నోట ఒకటే మాట..

0
19వెండితెరపై తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే అంతకు రెట్టింపు జోష్‌తో తదుపరి సినిమాలో నటించి హిట్ పట్టేయడం మనోడి సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా కంటిన్యూ చేశారని చెప్పుకుంటున్నారు. ‘క్రాక్’ అంటూ వచ్చి తన పర్‌ఫార్‌మెన్స్‌తో వరుస పరాజయాలను మరిపించేశాడని అంటున్నారు. మరి శనివారం సాయంత్రం విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? ట్విట్టర్ ద్వారా సినిమాపై ప్రేక్షకుల ఎలాంటి అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారో చూద్దామా..

‘షూర్‌ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చ పేలిపోద్ది’ అంటూ మాస్‌ డైలాగ్‌తో విడుదలకు ముందే ట్రెండ్‌ సృష్టించిన రవితేజ.. అన్నంత పని చేసి చూపించారని అంటున్నారు ఈ మూవీ చూసిన ఆడియన్స్. ప్యూర్ మాస్ ఎంటర్‌టైనర్, పక్కా బ్లాక్‌బస్టర్ అంటూ వేలకొద్ది ట్వీట్స్ చేస్తున్నారు. రవితేజ యాక్టింగ్ అదిరిపోయిందని, ‘క్రాక్’ విజయంతో 2021కి స్వాగతం పలుకుతుండటం ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు. రవితేజకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అని, శృతి హాసన్ రోల్ అదిరిందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక థమన్ మ్యూజిక్‌కి మరోసారి పట్టం కడుతున్నారు సంగీత ప్రియులు.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి డైరెక్టర్ గోపీచంద్ మలినేనిలో స్పష్టంగా కనిపించిందని, పవర్‌ఫుల్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్ ఆహా అనిపించేలా ఉన్నాయని చెబుతున్నారు. విలన్స్‌తో రవితేజ పోరాట సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి. విలన్స్‌తో ఇంట్రాక్షన్.. పోరాటాలు హైలెట్ అయ్యాయని టాక్.

ఇక ‘క్రాక్’లో థమన్ ట్రాక్ చెప్పుకోదగినదని ట్వీట్స్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడని అంటున్నారు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్‌లో కుమ్మిపడేశాడని చెబుతున్నారు. ఈ సినిమా థమన్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కొందరు పేర్కొంటుండటం విశేషం. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ అయ్యాయనేది ప్రేక్షకుల మాట. చెప్పుకోదగిన మరో విశేషం ఏంటంటే.. క్లాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మరి ఈ సినిమా కథ, కథాంశం ఎలా ఉంది? సమయం కంప్లీట్ రివ్యూ మరి కొద్ది సేపట్లోనే ప్రచురించనున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here