‘క్రాక్’ ఎక్కించిన రామ్ చరణ్ రివ్యూ.. సూపర్బ్ రియాక్షన్స్

0
33మాస్ రాజా నటించిన ‘క్రాక్’ సినిమాపై సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నాళ్లుగానో రవితేజ అభిమానులు ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సంక్రాంతికి లభించడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. బలుపు, డాన్ శీను లాంటి హిట్ చిత్రాలను అందించిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో రవితేజకు హ్యాట్రిక్ ఇచ్చారు. థియేటర్స్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించారు మెగా హీరో తేజ్. క్రాక్ చిత్రాన్ని వీక్షించిన రామ్ చరణ్ చిత్ర యూనిట్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

క్రాక్ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేశాను.. నా ఫేవ‌రెట్ ర‌వితేజ గారు టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. శృతి హాసన్ ఉత్తమ నటన కనబరిచింది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ అద్భుతమైన పాత్రలతో అలరించారు. థమన్ మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ సూపర్బ్. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు’ అంటూ క్రాక్ చిత్రానికి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్.

కాగా రామ్ చరణ్ ట్వీట్‌పై హీరో రవితేజ, హీరోయిన్ శృతి హాసన్, దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్ స్పందిస్తూ మీ ఆదరణ ప్రేమకు ధన్యవాదాలు.. ఇది మాకు ప్రైడ్ మూమెంట్.. మా టీంకి పర్ఫెక్ట్ సంక్రాంతి గిఫ్ట్ అంటూ ట్వీట్లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here