కొడుకుని చంపిన కన్నతల్లి.. మాస్టర్ ప్లాన్‌తో మేనమామకే సుపారీ, ఎందుకో తెలిస్తే షాక్!

0
34సుపారి ఇచ్చి కన్న కొడుకునే తల్లి చంపించిన వైనం జిల్లాలో వెలుగుచూసింది. తాగి వచ్చి తల్లిని వేధిస్తున్న మైనర్ బాలుడ్ని తల్లి కిరాతకంగా చంపించింది. వికారాబాద్ జిల్లా కోహ్లీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలివీ..

వికారాబాద్ జిల్లా కోహ్లీ ప్రాంతంలో వారం రోజుల క్రితం 17 ఏళ్ల బాలుడు శివప్రసాద్ కనిపించకుండా పోయాడు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలుడు కనిపించకుండా పోవడాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ తరుణంలోనే పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన శివప్రసాద్ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ఒక బావిలో పోలీసులు గుర్తించారు.

దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి విచారణ జరిపించారు. దీంతో పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం శివప్రసాద్ ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఈ సమయంలో మేనమామ అతణ్ని తీసుకెళ్లి గొంతు చుట్టూ టవల్ బిగించి చంపివేశాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని తీసుకు వెళ్లి బావిలో పూడ్చి బెట్టాడు. అయితే కుమారుడిని చంపించేందుకు తల్లి తన సోదరుడికి లక్ష రూపాయలు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో బయట పడింది. తాగి వచ్చి నిత్యం వేధిస్తున్నాడనే కోపంతో తన కుమారుడిని హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో బయట పడింది. ఈ మేరకు తల్లి, మేనమామతో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here