కూతురు పెళ్లి కార్డులు ఇచ్చి వస్తూ తల్లిదండ్రులు.. నెల్లూరులో విషాదం

0
44కూతురి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు వెళ్లి వస్తూ దంపతులు మృత్యువాతపడిన అత్యంత విషాద ఘటన జిల్లాలో జరిగింది. ఉదయగిరి మండలం వడ్లమూడిపల్లికి చెందిన గంగి శ్రీనివాసులరెడ్డి(48), వెంకటరత్నమ్మ(40) భార్యాభర్తలు. వారికి ఇద్దరు కూతుళ్లు సంతానం. పెద్దకూతురికి వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. వచ్చే నెల 7వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.

పెళ్లి ఏర్పాట్లలో భాగంగా వివాహ పత్రికలు అచ్చువేయించారు. మొదటి పత్రిక వరుడి ఇంట్లో ఇచ్చేందుకు దంపతులు బైక్‌పై వెళ్లారు. వరుడి కుటుంబంతో పాటు బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి ప్రయాణామయ్యారు. జడదేవి – తెడ్డుపాడు గ్రామాల మధ్యకు సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ని ప్రమాదవశాత్తూ వెనక నుంచి ఢీకొట్టారు. బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కూతురి పెళ్లి చేసే ఆనందంలో ఉన్న కుటుంబంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here