కిడ్నాప్ చేశారంటూ భర్తకు ఫోన్.. తీరా చూస్తే Hydలో, మరో నాటకం!

0
22ట్కేసర్‌లో ఫార్మసీ విద్యార్థిని ఘటన గురించి జనం చర్చించుకుంటుండగానే.. నర్సాపూర్‌లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పట్టణంలో మసత్ (30) అనే మహిళ ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి శనివారం (ఫిబ్రవరి 13) ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నుంచి తన భర్తకు ఫోన్ చేసింది. తనను, తన కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారంటూ సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది.

ఆందోళనకు గురైన భర్త.. వెంటనే నర్సాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. అతడిని ప్రశ్నించి ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా మసత్ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేసి ఆమె ఆచూకీ పట్టుకున్నారు.

మహిళను విచారించగా ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తేలింది. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ కార‌ణాల వ‌ల్లే ఆమె కిడ్నాప్ నాటకానికి తెర తీసి తన కుమారుడిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. మహిళను, కుమారుడిని నర్సాపూర్ తీసుకెళ్లిన పోలీసులు.. ఆమె భర్తకు అప్పగించారు.

కుటుంబంలో కలతలు చోటు చేసుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. బాధిత మహిళకు కౌన్సెలింగ్ చేసి ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here