ఈ రొమాంటిక్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ప్రియాతి ప్రియమైన కళ్యాణ్ దేవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాంతం నా ప్రాణ స్నేహితుడితో జీవించే అదృష్టం దొరికింది చాలు’’ అని శ్రీజ పేర్కొన్నారు. శ్రీజ పోస్ట్ చూసిన మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా, కళ్యాణ్ దేవ్ – శ్రీజ వివాహం 2016 మార్చి 28న బెంగళూరులో జరిగింది. ఇది శ్రీజకు రెండో పెళ్లి. ఈ దంపతులకు 2018 డిసెంబర్లో నవిష్క జన్మించింది. అంతకు ముందు శ్రీజకు కుమార్తె నివృతి ఉంది. ప్రస్తుతం నివృతి కూడా కళ్యాణ్ దేవ్, శ్రీజ దంపతులతోనే ఉంటోంది. ప్రస్తుతం వీరిది హ్యాపీ ఫ్యామిలీ. కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు.
‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు ‘సూపర్ మచ్చి’ అనే మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తోన్న ‘కిన్నెరసాని’ మోషన్ పోస్టర్‌ను ఈరోజు కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. దీంతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో కళ్యాణ్ దేవ్ మరో సినిమా చేస్తున్నారు.