కరోనా కోరల్లోంచి బయటపడ్డ రకుల్ ప్రీత్ సింగ్.. హ్యాపీగా ఉన్నానంటూ పోస్ట్

0
25స్టార్ హీరోయిన్ నుంచి కోలుకుంది. వారం రోజుల క్రిందట తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రకటించిన ఆమె.. తాజాగా తాను కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, తాను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపింది రకుల్.

”కరోనా నుంచి ఇంత త్వరగా కోలుకున్నానని చెబుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం క్షేమంగా ఉన్నా. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నా. 2021ను పాజిటివ్ దృక్ప‌థంతో మొద‌లు పెట్టాల‌ని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ దయచేసి ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉంటూ మాస్క్‌లు ధరించండి. అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను” అని పేర్కొంది రకుల్.

ఇక రకుల్ కెరీర్ చూస్తే.. ప్రస్తుతం ఈ ఢిల్లీ భామ చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్ హీరోగా రాబోతున్న సినిమాలో నటిస్తోంది రకుల్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ‘కొండ పొలం’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్. దీంతో పాటు నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక హిందీలో మూడు సినిమాలు, తమిళ్‌లో మరో రెండు సినిమాలు చేస్తోంది రకుల్. సో.. చూడాలి మరి 2021 రకుల్‌కి ఏ మేర కలిసొస్తుందనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here