ఒళ్ళు జలదరించే ఘటన.. మునుషుల్లో ఇంకెప్పుడు మార్పు వస్తుందంటూ కుష్బూ ఎమోషనల్ పోస్ట్

0
38ఈ సమాజంలో జరిగే కొన్ని ఘటనలు, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రవర్తించే తీరు దేశం మొత్తాన్ని కుదిపేస్తుంటాయి. అసలు వీరిలో కొంచమైనా మానవత్వం ఉందా? అనేలా వ్యవహరిస్తుంటారు కొందరు. మూగ జీవాలను అత్యంత దారుణంగా హింసిస్తున్న సంఘటనలు
నిత్యం ఎక్కడో చోట బయటపడుతుండటం యావత్ జంతు ప్రేమికులను కలచివేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో షేర్ చేసిన సీనియర్ నటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు యువకులు ఓ డాల్ఫిన్‌పై తీవ్రంగా దాడి చేశారు. రక్తం చిందిస్తున్నా గొడ్డలి, కర్రలతో కొట్టి కొట్టి చంపేశారు. అంత పెద్ద జీవిని అలా హింసిస్తూ చంపేసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా చేసేదేమీ లేక తమ బాధ వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇదే వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కుష్బూ.. ”ఒళ్ళు జలదరించే ఘటన, హృదయ విదారకరం.. ఇలాంటి మనుషుల్లో ఇంకెప్పుడు మార్పు వస్తుంది? సాటి జీవాలను బ్రతికే హక్కు లేదా” అని పేర్కొంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు.

గతంలో కేరళ రాష్ట్రంలో ఏనుగు మృతి ఘటన ఇలాగే దేశవ్యాప్తంగా సంచలనం అయింది. గర్భంతో ఉన్న గజరాజుకు పైనాపిల్ ఆశ చూపి కిరాతకానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆడ ఏనుగుకు టపాసులతో నింపిన పైనాపిల్ తినిపించారు. ఆశగా ఆ పండు తిన్న ఏనుగు నోటిలోనే పేలుడు సంభవించడంతో నోటి నిండా, తొండానికి గాయాలై విలవిలలాడిపోతూ ప్రాణాలు విడిచింది. మళ్ళీ దాదాపుగా ఇలాంటి వీడియోనే వైరల్ అవుతుండటం ప్రతి ఒక్కరి హృదయాన్ని గాయ పర్చింది. జంతు ప్రేమికులు ఈ అమానవీయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here