దీంతో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి తర్వాతి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. కొత్త సంవత్సరం, సంక్రాంతికి కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ట్విటర్ ద్వారా నాగ్ అశ్విన్ను ప్రశ్నించాడు. ప్రభాస్తో మీరు చేయబోయే సినిమా అప్డేట్స్ ఏంటి? అడిగాడు. దీనిపై స్పందించిన నాగ్ అశ్విన్.. ”కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29, ఫిబ్రవరి 26న అప్డేట్స్ రెడీ చేస్తున్నాం” అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ రెండు అప్డేట్స్ ఏమై ఉంటాయనే దానిపై ప్రేక్షకుల్లో కుతూహలం పెరిగింది.
సైన్స్ ఫిక్షన్ కథతో భారీ రేంజ్లో రూపొందనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్గా నటించనుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు నాగ్ అశ్విన్.