ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ నటుడు.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

0
30



మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే నటించబోతున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాను ఎన్టీఆర్ మొదలుపెడతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ RRR షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ రూమర్ ప్రస్తుతం వినిపిస్తోంది.

త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర నటించనున్నారని ప్రెజెంట్ టాక్. ప్రస్తుతం ఉపేంద్రతో త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నారట. త్రివిక్రమ్‌తో ఇప్పటికే ఉపేంద్ర పనిచేశారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన్ని విలన్‌గా కూడా త్రివిక్రమ్‌ ఒప్పిస్తారనే టాక్ నడుస్తోంది.

తనకు పాత్ర నచ్చితే తెలుగులో కూడా నటించడానికి సిద్ధమని ఆ మధ్య ఇంటర్వ్యూలో ఉపేంద్ర చెప్పారు. పాత్ర నచ్చడంతో వరుణ్ తేజ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. మరి ఎన్టీఆర్ సినిమాలో ఉపేంద్ర విలన్ అనే వార్త నిజ రూపం దాల్చుతుందో లేదో చూడాలి. కాగా, ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here