ఇక డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్.. కేంద్రం బిగ్ స్టెప్

0
25డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసే ప్రక్రియకు బీజం వేయనుంది. డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్‌ శిక్షణా కేంద్రాలకు ఈ మేరకు అక్రిడిటేషన్‌ ఇవ్వనుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి శుక్రవారం (ఫిబ్రవరి 5) డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అంటే.. ఇకపై డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ధ్రువీకరిస్తే టెస్టింగ్ లేకుండానే లైసెన్సులు జారీ చేస్తారన్నమాట. అలాగని.. ఆ శిక్షణా కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వాటికి అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు పలు నిబంధనలను ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ప్రయోజనాలు/ లక్ష్యాలు:

  • డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు మరిన్ని అధికారాలను కల్పించి పౌరులకు డ్రైవింగ్‌లో నాణ్యతతో కూడిన శిక్షణను అందించడం.
  • డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం.
  • రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించడం.
  • రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here