ఇంకా దొరకని 136 మంది ఆచూకీ.. ఇక మరణించినట్టే!

0
15త్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో సంభవించిన జలప్రళయం ఘోర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. నందాదేవీ హిమనీనదం విరిగిపడి దౌలీగంగా నది ఉప్పొంగడంతో విద్యుత్ కేంద్రమే కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 204 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 68 మంది మృతదేహాలు లభించాయి. మిగిలిన 136 మంది ఏమయ్యారనేది మిస్టరీగా మారింది.

ఘటన జరిగి 15 రోజులు పూర్తవుతున్నా.. ఈ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు, రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. గల్లంతైన వారిని ‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం’ అని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మృతుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 23) ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఘటన జరిగి 15 రోజులు గడుస్తుండటంతో బాధిత కుటుంబాలు ఇప్పటికే తమ వారిపై ఆశలు వదిలేసుకున్నాయి. కొంత మంది గల్లంతైన తమ వారి ఫొటోలను పెట్టి అంతిమ సంస్కారాలను కూడా పూర్తి చేశారు. నాటి విషాదాన్ని తలచుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here