ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమైన మోదీ.. వీడియో వైరల్

0
22కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన .. ఈ సందర్భంగా గతేడాది దేశంలో కరోనా వైరస్ పరిస్థితులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కరోనా మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమైందని మోదీ కన్నీటిపర్యంతమయ్యారు. కరోనా పోరులో గతేడాది దేశం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

కరోనాను తరిమికొట్టేందుకు లక్షలాది మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు నిర్విరామంగా పనిచేశారని, ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా కొంత మంది ఇంటి ముఖం కూడా చూడలేదని ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహమ్మారి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, కరోనా కారణంగా ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన చెందారు.

ఆసుపత్రుల్లో చేరిన వృద్ధులను వారి కుటుంబసభ్యులు కలుసుకోలేక అనాథల్లా మిగిలిపోయారన్నారు. ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రోనా వ్యాప్తి పెరుగుతుండటంతో కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని, లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం అంత సులభం కాదన్నారు.

కానీ క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నా ప్రజలు బాధ్యతయుతంగా సహకరించడంతో కరోనా వ్యాప్తిని అరికట్టగలిగామని, ఈ సమయంలో ప్రజలంతా ఒక్కటిగా ఉన్నారు అని మోదీ కొనియాడారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ సత్తాను ప్రపంచానికి చాటామని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు.

టీకా కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు.. వారి కృషి ఫలితంగా రెండు దేశీయ వ్యాక్సి‌న్‌లు వచ్చాయన్నారు. మరికొన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తొలి హక్కుదారులని మోదీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here