ఆస్కార్ విన్నర్, ఫేమస్ యాక్టర్ క్రిస్టఫర్ ప్లమ్మర్ కన్నుమూత

0
19ప్రముఖ కెనెడియన్ యాక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత కన్నుమూశారు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌’ అనే మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్య కారణాలతో మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. క్రిస్టఫర్ ప్లమ్మర్ ఇక లేరనే వార్త తెలిసి హాలీవుడ్ వర్గాల్లో విషాదం అలుముకుంది. పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నిన్న (ఫిబ్రవరి 5) క్రిస్టఫర్ ప్లమ్మర్ మృతి చెందారని ఆయన భార్య ఎలైన్ టేలర్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం కింద పడటంతో ఆయన తలకు తీవ్ర గాయమైందని, దాంతో ఆయన కోలుకోలేక అనారోగ్యంతో మరణించారని ఆమె అన్నారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో రేడియో, స్టేజ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ ప్రారంభించి ‘ది స్టార్ క్రాస్’ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు క్రిస్టఫర్ ప్లమ్మర్. ఆయన నటించిన సినిమాల్లో ”ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్, ది లాస్ట్ స్టేషన్” పాపులర్ అయ్యాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన ఆయన.. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నారు. 2010లో క్రిస్టఫర్ ప్లమ్మర్ నటించిన ‘బిగినర్స్’ అనే సినిమాకు గాను ఆస్కార్ పురస్కారం లభించింది. అప్పుడు ఆయన వయసు 82 సంవత్సరాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here