అల్లరి నరేష్ ‘నాంది’.. ఫ్రెండ్ కోసం రంగంలోకి మహేష్ బాబు

0
31పూర్తి భిన్నమైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్రలో నటించిన చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మించారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 19న విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ పోషించిన పాత్ర సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేలా చేసింది. ఆ ఆసక్తిని, అంచనాలను మరింత పెంచేందుకు రేపు (ఫిబ్రవరి 6న) ‘నాంది’ ట్రైలర్ వస్తోంది. ‘నాంది’ ట్రైలర్‌ను సూపర్ స్టార్ విడుదల చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని అల్లరి నరేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘రేపు ఉదయం మా నుంచి మీ అందరికీ చాలా ప్రత్యేకమైన బహుమతి ఇస్తున్నాం. ‘నాంది’ ట్రైలర్‌ను ఉదయం 10:08 గంటలకు మనందరి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు విడుదల చేయబోతున్నారు’ అని అల్లరి నరేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అల్లరి నరేష్, మహేష్ బాబు కలిసి ‘మహర్షి’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా కనిపించారు. ఇప్పుడు తన స్నేహితుడి సినిమాను ప్రమోట్ చేయడానికి మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నారు. మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల ‘నాంది’కి ఇండస్ట్రీలో క్రేజ్ మరింత పెరుగుతుంది.

కాగా, ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. చోటా కె. ప్రసాద్ ఎడిటర్. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. చైతన్య ప్రసాద్, శ్రీమణి సాహిత్యం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here