అర్దశతాబ్దం: ఏ కనులు చూడని చిత్రమే.. రకుల్ ప్రీత్ సింగ్ లవ్లీ సపోర్ట్

0
29చిన్నసినిమాకు పెద్ద సెలబ్రిటీల సపోర్ట్ లభిస్తే అంతకుమించిన ప్రమోషన్ మరొకటి ఉంటుందా? ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను సపోర్ట్ చేసేందుకు సెలబ్రిటీలు ఆసక్తి చూపుతుండటం చిత్రసీమకు బాగా కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అర్ద శతాబ్ధం’కు విడుదలకు ముందే మంచి సపోర్ట్ లభిస్తోంది.

కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో ఈ ‘అర్ద శతాబ్ధం’ రూపొందుతోంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ ఇష్యూను మెయిన్ పాయింట్‌గా తీసుకొని నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

రీసెంట్‌గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ అర్ద శతాబ్దం టీజర్ రిలీజ్ చేయగా, ఫస్ట్ గ్లింప్స్ దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. ఇక తాజాగా చిత్రంలోని ‘ఏ కనులు చూడని చిత్రమే’ పాటని గ్లామర్ స్టార్ హీరోయిన్ రిలీజ్ చేశారు. నౌపల్ రాజా సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ”అర్దశతాబ్దం టీజర్ చూశాను. చాలా బాగుంది. ఏకనులు చూడని చిత్రమే సాంగ్ వింటుంటే మెలోడియస్, రొమాంటిక్ ఫీల్ వస్తోంది. అష్కర్ ఫోటోగ్రఫీ సూపర్బ్‌గా ఉంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా బిగ్ హిట్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు. లవ్లీ మెలోడీ అంటూ ట్వీట్ కూడా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here