అమ్మా నువ్ లేకుంటే మేం లేము.. రుణపడి ఉంటా మామా.. వైష్ణవ్ తేజ్ ఎమోషనల్ స్పీచ్, లైట్‌మేన్ గురించి చెప్తూ

0
24మెగా హీరో తొలి స్పీచ్‌తోనే ఆకట్టుకున్నారు. ఆయన అరంగేట్రం మూవీ ‘’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను శనివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించగా.. మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేనమామ ముందు మైక్ పట్టుకుని మంచి బేస్ వాయిస్‌తో స్పీచ్‌ ఇచ్చి అలరించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

ఆయన మాట్లాడుతూ.. ‘నేను మా అమ్మ గురించి మాట్లాడాలి.. నువ్ మా కోసం చేసిన త్యాగాలకు థాంక్స్ అమ్మా.. నువ్ లేకపోతే మేం లేము. మా ముగ్గురు మావయ్యలు గురించి మాట్లాడాలి.. మెగాస్టార్ చిరంజీవిగారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారూ.. నాగేంద్రబాబు మావయ్యల గురించి మాట్లాడాలి.. వీళ్లు ముగ్గురూ లేకపోతే మేం లేము.. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతుండేవారు. జీవితాంతం రుణపడి ఉంటాం మా మామయ్యలకు. నన్ను సొంత కొడుకుగా చూసుకున్నారు.

ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ‘ఉప్పెన’ సినిమాకి హీరో నేను కాదు.. ఈ సినిమా కథే హీరో.. ఇలాంటి కథకు నన్ను హీరోగా పెట్టినందుకు చాలా థాంక్స్. నాకు తొలి సినిమా కావడంతో చాలా టిప్స్ చెప్పారు. ఈ సినిమా ఉప్పాడలో తీశాం.. అక్కడ ప్రజలందరికీ చాలా థాంక్స్. ఇది వాళ్ల కదే.

మైత్రీ ప్రొడక్షన్స్ వాళ్లకి చాలా పెద్ద థాంక్స్.. ఈ సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. డైరెక్టర్ సుకుమార్‌ని కలిసినప్పుడు.. సార్ నాకు యాక్టింగ్ రాదు… డైలాగ్‌లు రావు అన్నప్పుడు ఏ పర్లేదు నేను నేర్పిస్తా అని చెప్పారు. నాలో కాన్ఫిడెన్స్ నింపింది ఆయనే.

విజయ్ సేతుపతి గారు ఎంత బిజీగా ఉన్నా మాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. నాకు చాలా టిప్స్ ఇచ్చారు. హీరోయిన్ క్రితిశెట్టి గారు.. నాతో కలిసి చేయడం కాదు.. ఆమె కూడా యాక్టింగ్ పరంగా హెల్ప్ చేసింది. ఆమెకి తెలుగు రాదు కానీ.. వారంలో తెలుగు నేర్చుకుని డైలాగ్‌లు చెప్పింది. ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నా.. సినిమా కోసం ఎంత కష్టపడతారన్నది నేర్చుకున్నా.. లైట్ మేన్‌కి కాలు విరిగినా సరే.. రెండురోజులు అదే కాలితో పనిచేశారు. ఈ సందర్భంగా లైట్ మెన్‌ అందరికీ థాంక్స్ చెప్తున్నా.. వాళ్ల వల్లే మేం అందంగా కనిపిస్తున్నాం. జూనియర్ ఆర్టిస్ట్‌లు అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు.

ఈ సినిమాకి సోల్.. సంగీతం. ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు అంటూ ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్.. నాన్ టెక్నికల్, ప్రొడక్షన్ ఇలా అందరి గురించి పేరు పేరున గుర్తుపెట్టుకుని ధన్యవాదాలు తెలిపారు హీరో వైష్ణవ్ తేజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here