అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. స్పందించిన హీరోయిన్ తల్లిదండ్రులు

0
30అందం, అభినయం కలగలిసిన అద్భుతమైన నటిగా కీర్తి సురేష్‌కు సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి. ‘మహానటి’ తరవాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గానూ నటిస్తున్నారామె. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే, సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కంపోజర్లలో ఒకరిగా కొనసాగుతోన్న అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అనిరుధ్, కీర్తి రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. ఈ ఏడాది ఆఖర్లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అక్టోబర్ 17న అనిరుధ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కీర్తి సురేష్ పోస్ట్ చేసిన ఫొటోలను ఆధారంగా చేసుకుని ఈ రిలేషన్‌షిప్ వార్తలు వచ్చాయి.

అయితే, ఈ రూమర్లపై కీర్తి సురేష్ తల్లిదండ్రులు సురేష్ కుమార్, మేనక స్పందించినట్టు మలయాళ మీడియా పేర్కొంది. తమ కూతురు ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేదని, ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టారని కీర్తి తల్లిదండ్రులు స్పష్టం చేశారట. కీర్తి సురేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’తో పాటు ‘గుడ్ లక్ సఖి’, ‘అన్నాత్తే’ సినిమాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here