అనసూయకు బంపర్ ఆఫర్.. స్టార్ హీరోతో నటించే లక్కీ ఛాన్స్! జబర్దస్త్ బ్యూటీ రేంజ్ చూడండి

0
17జబర్దస్త్ తెరపై జబర్దస్తీ చేస్తూ రోజురోజుకూ తన పాపులారిటీని అమాంతం పెంచేసుకుంటున్న .. వెండితెరపై కూడా వరుస అవకాశాలు పట్టేస్తోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మతగా టాలెంట్ మొత్తం బయటపెట్టేసి దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసుకుంది అనసూయ. దీంతో తమ సినిమాల్లో అనసూయ కనిపితే కాస్త ప్లస్ అవుతుందని దర్శకులు ఆలోచించే రేంజ్ లోకి వెళ్ళింది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట.

మలయాళ స్టార్ హీరో హీరోగా నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం అనసూయను సెలక్ట్ చేశారని సమాచారం. ఈ రోల్ నచ్చడంతో అనసూయ కూడా ఏ మాత్రం సందేహించకుండా వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. గతంలో మమ్ముట్టి తెలుగులో నటించిన `యాత్ర` చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషించింది. మళ్ళీ ఇప్పుడు ఆయనతోనే, అది కూడా మలయాళీ తెరపై కనిపించే ఛాన్స్ వచ్చిందంటే సౌత్‌లో అమ్మడి రేంజ్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఇప్పటికే ఓ అరడజను సినిమాలను లైన్‌లో పెట్టింది యాంకర్ అనసూయ. ప్రస్తుతం కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీ.. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో పాటు ”ఆచార్య, పుష్ప, ఖిలాడీ, పక్కా కమర్షియల్” చిత్రాల్లో ఆమె భాగమవుతోందట. ఏదేమైనా ప్రస్తుతం అనసూయ జోష్ చూస్తుంటే వెండితెరపై ఈ ఏడాది అమ్మడి జబర్దస్తీ బాగానే ఉంటుందనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here